Mahesh babu next movie to release in 2017
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుండగా.. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మహేష్ సినిమాను 2017 సంవత్సరంలో విడుదల చేసే ఛాన్సు ఉందంటూ ఓ వార్త ఫిలింనగర్‌లో షికారు చేస్తుంది.
Mahesh babu next Film in 2017
విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న సమయంలో ఇటువంటి వార్త మహేష్ ఫ్యాన్స్‌లో తెగ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇదంతా బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ గురించి కాదులెండీ.. మహేష్ నటించబోయే 25వ సినిమా గురించి. బ్రహ్మోత్సవం సినిమా మహేష్ నటిస్తున్న 22వ సినిమా. దీని తరువాత మహేష్ మురుగదాస్ కాంబినషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో మహేష్ 23 సినిమాలు కంప్లీట్ చేస్తాడు.
Mahesh babu murugadas movie to be release in 2017
ఈ సినిమా పూర్తయిన తరువాత 24వ సినిమాగా పూరీ జగన్నాథ్‌తో తెరకెక్కనున్న ‘జనగణమన’ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి రెండు సినిమాలు 2017 చివరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.దీంతో మహేష్ 25వ సినిమా వచ్చే ఏడాది ఉండబోతోంది అంటూ టాలీవుడ్ వర్గాలతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా కనీసం వచ్చే ఏడాదికి రెడీ అవుతుందో లేదో చూడాలి.
![]() |
Mahesh babu movie to release in 2017 |
Post a Comment